రేపే కాలాష్టమి.. ఈ రోజు విశిష్టత ఏంటంటే..

పురాణాల ప్రకారం భైరవాష్టమిగా పిలుచుకునే కాలాష్టమి రేపు రాబోతోంది. ప్రతి నెలా కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కాలాష్టమిని జరుపుకుంటారు. ఈ కాలం శివుని ఉగ్రరూపంగా పిలవబడే భైరవుడికి అంకితం ఇచ్చారు. శివుని ఐదవ అవతారమే భైరవుడని అంటారు. అందుకే భైరవాష్టమి రోజున కాల భైరవుని అనుగ్రహాన్ని పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున శివునితో పాటు ఆయన ఐదో రూపమైన కాల భైరవుడిని పూజిస్తే మన కష్టాలన్నీ తొలిగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కొందరి నమ్మకం ప్రకారం ఈ రోజున కాల భైరవుడిని నిశిత ముహూర్తంలో ఆరాధిస్తే మంత్ర, తంత్రం విద్యను పొందుతారని నమ్మకం.

చైత్ర మాసంలోని కాలాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? తదితర విషయాలు మీకోసం.. హిందూ క్యాలెండర్ ప్రకారమైతే చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రేపు అంటే 1 మే 2024 బుధవారం ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. గురువారం ఉదయం 4:01 గంటలకు ముగుస్తుంది. కాబట్టి నెలవారీ కాలాష్టమి బుధవారమే జరుపుకోవాలి. ప్రదోషకాల సమయంలో పూజ చేసుకోవడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి ధూపదీపాలు వెగించి పూజ చేసుకోవాలి. శివుడి కుటుంబాన్ని పూజించుకున్న మీదట హారతి ఇచ్చి పూజను ముగించాలి. అనంతరం సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఉపవాసాన్ని ప్రారంభించాలి.

Share this post with your friends