ఇవాళ బుద్ధ పూర్ణిమ. బుద్ధ జయంతినే బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. ఇది బౌద్ధ మతస్థులకు చాలా ముఖ్యమైన పండుగ. ఇవాళే బోధి వృక్షం కింద బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని.. దీనిని మహాపరినిర్వాణం అని కూడా అంటారు. వైశాఖ మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజున దానాలు చేస్తే చాలా మంచిదని చెబుతుంటారు. జ్ఞానంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని నమ్మకం. ఈ రోజున ఏమేం దానాలు చేయడం వలన ప్రయోజనం చేకూరుతుందో చూద్దాం. వాస్తవానికి వైశాఖ మాసంలో సందర్భాన్ని పురస్కరించుకుని దానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరి బుద్ధ పూర్ణిమ రోజు ఏం దానాలు చేయాలో చూద్దాం.
ఇవాళ సన్యాసులు, పేదలకు ఆహారం, బట్టలు, మందులు, ఇతర వస్తువులను దానం చేస్తే మంచిదట. అలాగే నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగుల వంటివి దానం చేయడం వలన పుణ్యం లభిస్తుందట. ఆకలితో ఉన్న వారికి ఆహారం దానం చేసినా మంచిదేనట. నేడు చెట్లను నాటినా లేదంటే చెట్ల పెంపకం ప్రచారంలో పాల్గొన్నా కూడా మంచిదేనని నమ్ముతారు. దేవాలయాలు, గోశాలలు లేదా ఇతర మత సంస్థలకు విరాళాలను సైతం అందించినా మంచిదేనట. ముఖ్యంగా ఈ రోజున చేసే దానం ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుందని నమ్మకం.