ఈ శివాలయం చాలా శక్తివంతమైనదట.. దీని విశిష్టతలేంటంటే..

శివాలయాల గురించి వింటూనే ఉంటాం. కానీ అత్యంత ఆసక్తికరమైన.. కళ్లు రెండింతలు చేసుకుని వినే శివాలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయమే శ్రీవరదరాజేశ్వర శివాలయం. శివుడిని భోళా శంకరుడని కూడా అంటారు. కొంచెం భక్తి చూపించినా కరిగిపోతాడు. కర్ణాటక రాష్ట్రంలోని బిడాది సమీపంలోని జడేనహళ్లి అనే గ్రామంలో అత్యంత శక్తివంతమైన శివాలయం ఉంది. దీనిని శ్రీవరదరాజేశ్వర శివాలయంగా భక్తులు పిలుస్తుంటారు. శ్రీ నారాయణరెడ్డి గురువుకు కలలో ఒక మహర్షి కనిపించి దేవాలయాన్ని నిర్మించి దానిలో శివలింగాన్ని ప్రతిష్టించమని తెలిపాడట. ఆ తర్వాత రోజునే నర్మదా ఒడ్డున ఎర్రటి శివలింగం కనిపించిందని కొందరు వ్యక్తులు గురువుకు చెప్పారట.

ఈ శివలింగాన్ని వెంటనే జడేనహళ్లికి తీసుకొచ్చి ఆలయాన్ని నిర్మించి ఆచార నియమాల ప్రకారం శివలింగాన్ని ప్రతిష్టించారట. అదే రోజున అక్కడి భక్తులంతా చూస్తుండగానే ఓ కప్ప వచ్చి శివలింగానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసిందట. శివాలయం దగ్గర ఎప్పుడూ వినని ఉరుము శబ్దం ఒకటి వినిపించిందట. దీంతో అంతా హడావుడిగా ఆలయం వద్దకు రాగా… జనాలంతా చూస్తుండగానే శివలింగానికి ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు కాలి బూడిదైంది. అప్పటి నుంచి వరదరాజ స్వామివారి ఆలయంలో నిత్యపూజలు, హోమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇక్కడ కోరిన ప్రతిదీ జరగడంతో భక్తులకు కూడా నమ్మకం ఏర్పడింది. ఇది 13వ జ్యోతిర్లింగంగా పిలవబడుతోంది.

Share this post with your friends