ఈ శివాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది..

భోళా శంకరుడికి చెప్పుకోదగిన ఆలయాలు చాలానే ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరి పరమేశ్వరుడి అత్యంత పురాతమైన శివాలయం ఎక్కడుందో తెలుసా? మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్‌పూర్ అనే గ్రామంలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన శివాలయమట. మరి దీని ప్రత్యేకత ఏంటంటారా? ఈ ఆలయం నేటికీ పూర్తి కాలేదు. అప్పట్లో ఈ ఆలయాన్ని భోజరాజు నిర్మించారట. ఏమైందో ఏమో కానీ ఈ ఆలయ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి ఆలయ నిర్మాణానికి ఎవరూ పూనుకోలేదా? లేదంటే కావాలనే అలా ఆలయాన్ని వదిలేశారా? అనేది ఆసక్తికరమే.

ఈ ఆలయంలోని గర్భగుడిలో 7.5 అడుగుల (2.3 మీ) ఎత్తైన శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో పరమర రాజు భోజ పాలనలో ప్రారంభమైందని చెబుతారు. ఇది తెలియని కారణాల వల్ల నిర్మాణం నిలిచిపోయిందట. స్థలంలో అసంపూర్తిగా వదిలేసినవి చాలానే ఉన్నాయి. అలాగే రాళ్లపై చెక్కబడిన నిర్మాణ చిత్రాలు.. తాపీపని చేసినటువంటి గుర్తుల ద్వారా 11వ శతాబ్దపు భారతదేశంలోని ఆలయ నిర్మాణ పద్ధతులను అర్థం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా సైతం గుర్తించింది.

Share this post with your friends