ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ నాటకూడదట..

హిందువులు వాస్తుకు చాలా ప్రాధాన్యమిస్తారు. ఇంటి నిర్మాణంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తు పరమైన ఆలోచన చేస్తారు. చివరకు ఇంటి ముందు నాటే మొక్కల విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. కొన్నిసార్లు తెలిసీ తెలియక మనం చేసే పని కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలిసి వస్తుంది. వాస్తు ప్రకారం మొక్కలను ఎక్కడపడితే అక్కడ నాటకూడదు. ముఖ్యంగా కరివేపాకు మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మొక్కను కూడా ఎక్కడపడితే అక్కడ నాటకూడదట. సరైన స్థానంలో నాటకుంటే ఇక్కట్లు తథ్యమట. మరి కరివేపాకు మొక్క నాటేందుకు సరైన స్థలం ఏది?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పడమర వైపు కరివేపాకు మొక్కను నాటాలట. పడమర దిక్కు చంద్రుని దిశ అని చెబుతారు. ఈ పడమర దిక్కులో ఏదైనా దేశీయ మొక్కను నాటితే చంద్ర దోష పరిహారం ఉంటుందట. కరివేపాకు మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుందట. కాబట్టి ఈ ప్రాంతంలో ఇతర మొక్కలు నాటడం కంటే కరివేపాకు మొక్కను నాటడమే ఉత్తమం. కరివేపాకు మొక్కకు మురికి నీరు పనికి రాదట. అలాగే చీడ, పీడలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలట. మరో ముఖ్య విషయం ఏంటంటే.. కరివేపాకు మొక్క పక్కన చింత చెట్టును పెంచవద్దట. ఇలా చేస్తే మనం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటామట. ఇక కరివేపాకు గురించి తెలియనిదేముంది. ఇది ఆరోగ్యాన్ని ఎన్నో రకాల సమస్యల నుంచి కాపాడుతుంది.

Share this post with your friends