శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలివే..

మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడి నుంచి చాలా జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. గీతోపదేశం సారాంశం తెలుసుకుంటే చాలు మన జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం అందులో నుంచి లభిస్తుందని అంటారు. స్నేహితులకు శ్రీకృష్ణుడు ఎంతో విలువిస్తాడు. కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాడు.. ప్రేమిస్తాడు. వారు ఏమీ చెప్పకుండానే వారి సమస్యలన్నీ తీరుస్తాడు. స్నేహితుల విషయంలో మనం ఎలా ఉండాలో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. చిన్ని కృష్ణుడు చాలా అల్లరి చేసేవాడు. అయినా సరే.. అందులోనూ సమానత్వాన్ని చూపించేవాడు. మనుషులనే కాదు.. పశువులను సైతం ప్రేమగా చూసుకోవాలనే సత్యాన్ని దీని ద్వారా వెల్లడించాడు.

తల్లిదండ్రుల విషయంలో ప్రేమాభిమానాలకు ఏమాత్రం లోటు రానివ్వలేదు. జన్మరహస్యం తెలుసుకున్న కృష్ణయ్య మధురకు పయనమయ్యాడు. మేనమామ కంసుడి చెర నుంచి తల్లిదండ్రులను విడిపించి.. తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలనే సత్యాన్ని తెలియజేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలని తెలియజేశాడు. రాధ విషయంలో ఎలాంటి స్వార్థాన్ని కనబరచలేదు. అలా ప్రేమకు నిర్వచనంగా మారిపోయాడు. కురుక్షేత్రంలో తన సొంత వారిని ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న అర్జనుడికి హిత బోధ చేసి ధర్మ మార్గాన్ని అనుసరించమని సూచించాడు. యుద్ధ రంగంలో మనం అనుసరించాల్సిన విధి విధానాలను తెలియజేశాడు.

Share this post with your friends