శ్రీరామనవమి రాబోతోంది. ఈ తరుణంలో రాముడి గురించి.. రామాయణ కాలం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు స్మరణకు వస్తున్నాయి. కొన్ని విషయాలు మనకు తెలుసు కొన్ని తెలియవు. ఆ తెలియని విషయాల్లో ఒకటే డీప్ ఫేక్ కుట్ర. ఇటీవలి కాలంలో మనం డీప్ ఫేక్ పిక్స్ గురించి వింటున్నాం. కానీ డీప్ ఫేక్ కుట్ర కూడా ఉందా? అది కూడా నాటి కాలంలో.. రామయణం అనగానే మనకు గుర్తొచ్చే పేర్లలో మారీచుడు ఒకటి. సీతమ్మను బంగారు జింక రూపంలో మాయ చేస్తాడు. ఆ బంగారు జింక కోసం రాముడిని సీతమ్మ పంపిస్తుంది. అప్పుడే రావణుడు వచ్చి సీతమ్మను అపరిహస్తాడు.
మారీచుడు కామ రూప విద్యలో ఆరితేరినవాడు. అవసరాన్ని బట్టి తన రూపం మార్చుకునేవాడు. అలా మార్చుకునే బంగారు జింకగా సీతమ్మ వారికి కనిపించాడు. శ్రీరాముడి బాణానికి మారీచుడు నేల కూలిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ‘హే సీతా, తమ్ముడూ లక్ష్మణా’ అంటూ రాముడి గొంతుకను అనుకరించి సీతమ్మను తన ఫేక్ వాయిస్‌తో మభ్యపెట్టాడు. యుద్ధ సమయంలో రావణాసురుడు చాలా డీఫ్ ఫేక్ కుట్రలను చాలా పన్నాడట. రాముడి కృత్రిమ శిరస్సును విద్యుత్ జిహ్వుడనే మాయగాడి సాయంతో చేయించి సీతమ్మ ముందు పెట్టాడట. కానీ సీతమ్మ దానిని నమ్మలేదు. ఇక ఇంద్రజిత్తు అదృశ్య దాడులలో నేర్పరి. ఎన్నో కుట్రలు పన్నినా కూడా అంతమ విజయం శ్రీరాముడిదే అయ్యింది.