వాస్తవానికి భగవంతుడిని తమను ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తాడని మొక్కేవారే ఎక్కువగా ఉంటారు. కొందరు అవేమీ ఆశించుకుండా మొక్కే వారు కూడా ఉంటారు. అయితే భగవంతుడిని కోరిక ఎలా కోరాలి? ఎలాంటి కోరిక కోరాలి. మన బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు మన సంపదతో చేయాలి అని కోరుకోవాలి. తద్వారా మనకు ఆర్థిక కష్టాలు ఏమీ ఉండవు. పైగా ఇచ్చే స్థితిలో మనం ఉంటాం. మన ఇంట్లో నిత్య నైవేద్యం ఉండాలని కోరుకుంటే మనకు ఆహారానికి ఎలాంటి ఢోకా ఉండదట. నిత్యం ధాన్యం మన ఇంట నిలువ ఉంటుందట. నిత్య పూజ ప్రతి రోజు చేయాలని కోరుకోవాలట. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండి.. హాయిగా స్వామివారికి నిత్య పూజల చేస్తామట.
మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలని కోరుకోవాలట. అంటే ఇంట ధర్మపత్ని నిత్యం అనుకూలవతిగా ఉంటుందట. నా చివరి దశ వరకూ నీ క్షేత్రానికి దర్శనానికి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తే.. సంపూర్ణ ఆయుష్షును భగవంతుడు ప్రసాదిస్తాడట. భాగవతులతో గడప నిండుగా ఉండాలని కోరుకుంటే సమాజంలో మన గౌరవ ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లదట. కుటుంబమంతా సంతోషంగా క్షేత్ర దర్శనం చేసుకోవాలని కోరుకుంటే కుటుంబమంతా కలిసి మెలిసి ఉంటుందట. మహిళలైతే పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలని కోరుకుంటే భర్తకు సంపూర్ణ ఆయుష్షుతో జీవిస్తాడట. ఇలా కోరుకుంటే మనం అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో జీవిస్తామట.