శ్రీరామచంద్రుడు, సీతాదేవి నివసించిన రామ్‌టెక్ కోట విశేషాలేంటంటే..

శ్రీరామచంద్రుడు, సీతాదేవితో కలిసి అడువులన్నీ తిరుగుతూ నాగపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘రామ్‌టెక్ ఫోర్ట్’కు చేరుకున్నాడట. ఈ ప్రదేశంలో సీతాదేవి వంటగది కూడా నిర్మించిందని ప్రతీతి. ఆ వంటగది ఇప్పటికీ ఉంది. ఇక్కడే రుషులందరికీ వండి వడ్డించేదని పద్మపురాణం చెబుతోంది. ఈ కోట ప్రాముఖ్యం గురించి ఆసక్తికర కథనాలున్నాయి. ఈ రామ్ టెక్ కోట నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అయితే ఈ రామ్ టెక్ కోట నిర్మాణంలో ఇసుకను అణువంతైనా వినియోగించలేదట. ఇది దాని ప్రాధాన్యం.

కేవలం రాళ్లతో ఈ కోటను నిర్మంచారు. ఒకదానిపై ఒకటి రాళ్లను పేర్చుతూ రామ్‌టెక్ కోటను నిర్మించారు. దీనిని నిర్మించి శతాబ్దాలు గడుస్తున్నా.. అప్పటి నుంచి నేటి వరకూ వాటిలో ఒక్క రాయి కూడా కదల్లేదు. కోట చెక్కు చెదరనూ లేదు. ఇదంతా శ్రీరాముడి దయ అని స్థానికులు భావిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో ఉన్న చెరువులో ఏ సమయంలోనూ నీటి లెవల్ తగ్గదు. ఇక ఈ ఆలయాన్ని ఓ కొండపై నిర్మించారు. అందుకే దీనిని ఘర్ ఆలయమని కూడా పిలుస్తారు. ఇక్కడ పిడుగులు పడినప్పుడల్లా ఆలయ పైభాగం వెలిగిపోతూ ఉంటుంది. మహాకవి కాళిదాసు రామ్‌టెక్‌ను రామగిరి అని ప్రస్తావించారు. ఇక్కడ రామగిరి అంటే రాముడు నివసించిన కొండ అని అర్థమట.

Share this post with your friends