మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. అర్ధరాత్రి సమయంలో భోళా శంకరుడిని గురు ద్రోణాచార్యుల కుమారులు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య లు పాండవుల శిబిరం వద్దకు వెళ్లి పూజించడం ప్రారంభించారట. అసలే భోళా శంకరుడు కదా.. పూజకు ప్రసన్నుడయ్యాడట. దీంతో వారిని పాండవుల శిబిరంలోకి వెళ్లేందుకు అనుమతివ్వడమే కాదు.. ఒక ఆయుధాన్ని కూడా ఇచ్చాడట. ఆ ముగ్గురూ పాండవుల శిబిరంలోకి వెళ్లి శివుడి వరంతో పొందిన ఆయుధంతో పాండవులనుకుని ఉప పాండవులందరినీ చంపేసి సైలెంట్‌గా శిబిరం నుంచి బయటకు వచ్చారు.
విషయం తెలుసుకున్న పాండవులు తాము నిద్రిస్తు సమయంలో తమ కుమారులను హత మార్చడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆవేదన, ఆగ్రహానికి గురయ్యారు. విచక్షణ మరిచి శివుడిని దోషిగా భావించి ఆయనపై యుద్ధానికి బయలు దేరారట. శివునిపై పాండవులు దాడికి యత్నించగా వారి ఆయుధాలన్నీ శివునిలో ఏకమయ్యాయట. ఆపై తనపైన ఆయుధాలు ఎత్తన పాండవులపై ఆగ్రహించిన శివుడు మీరు చేసిన పాపానికి కలియుగంలో శిక్షింపబడతారని శపించాడట. దీంతో పాండవులంతా కలియుగంలో జన్మించారట. శివుడు శాపం ఇచ్చిన అనంతరం పాండవులంతా శ్రీకృష్ణుని వద్దకు రాగా.. ఆయన వారంతా కలియుగంలో ఎక్కడ, ఎవరి ఇంట్లో జన్మిస్తారో చెప్పాడట.