టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ గౌ. శ్రీఎస్. అబ్దుల్ నజీర్ ఏప్రిల్ 26వ తేదీ సందర్శించారు. బర్డ్‌లో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్స, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల గౌ.రాష్ట్ర గవర్నర్ అభినందించారు.
ఒక సంవత్సరంలో 14 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2500కు పైగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు.