ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం.. కానీ ఆ ఒక్కటే లోటు..

భారతదేశంలో ఆలయాలు ప్రతి ఊరిలోనూ ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించిన పురాణ కథలు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ ఆలయంలో రెండు అలాంటి ఆశ్చర్యకర విషయాలున్నాయి. ఇదొక శివాలయం…మధ్యప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో ఉంది. 1010 AD నుంచి 1055 AD మధ్యకాలంలో పర్మార్ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ భోజ రాజు నిర్మించాడు కానీ పూర్తిగా నిర్మించలేదు. అందుకే దీనిని అసంపూర్ణ ఆలయమని పిలుస్తారు. పాండవులు తమ తల్లి కుంతీదేవిని పూజించేందుకుగానూ ఈ ఆలయాన్ని నిర్మించారనేది మరో కథనం.

అయితే సూర్యోదయం లోపు ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావాలట కానీ పాండవులు పూర్తి చేయలేకపోవడంతో అసంపూర్ణంగా ఉండిపోయిందని కూడా చెబుతారు. ఇక ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శివలింగం. దీనిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఇక్కడే ఉంది. అంతేకాకుండా ఏకశిలతో తయారు చేసింది. శివలింగం ఎత్తు 2.3 మీటర్లు, చుట్టుకొలత 5.4 మీటర్లు.. శివ లింగం పావన వంటంతో సహా మొత్తం ఎత్తు 12 మీటర్లు. ఈ ఆలయంలో శిల్పకళా సంపద, గోపురాలు, రాతి నిర్మాణాలు ఎంత చూసినా తనివి తీరదు. 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేక ఉదాహరణ. ఈ ఆలయ నిర్మాణం కానీ పూర్తై ఉంటే.. ప్రాచీన భారతదేశ అద్భుత ఆలయాల్లో ఒకటిగా నిలిచేది.

Share this post with your friends