నేటితో ముగియనున్న కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. స్వామివారి ఆలయంలో ఈ నెల 21న ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి వరకూ వైభవంగా జరుగుతూ వచ్చాయి. ఇవాళ ఉదయం స్వామివారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు.

మే 28న సాయంత్రం 6 గంటల నుంచి స్వామి, అమ్మవార్లు బంగారు రథంపై విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాలకు ముందు మే 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. మే 20న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకూ.. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహన సేవలను నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు.

Share this post with your friends