తుది అంకానికి చేరుకున్న శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణంతో స్వామివారు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఎనిమిదవ రోజైన‌ బుధవారం ఉదయం 7:30 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇక నిన్న సాయంత్రం అశ్వవాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు ఊరేగారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఉంది. ఇది శ్రీకృష్ణుడి ఆలయం. విష్ణుమూర్తి దశావతారాల్లో తొమ్మిదవ అవతారంగా వేణుగోపాలుడిని పరిగణించడం జరుగుతోంది. గర్భాలయంలో వేణుగోపాల స్వామివారు రుక్మిణి, సత్యభామ సమేతుడై దర్శనమిస్తారు. ఈ విగ్రహాలు నారాయణవనం ఆలయం నుంచి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ సీత, లక్ష్మణ, ఆంజనేయ, పార్థసారథి, రేణుకా పరమేశ్వరి, అవనాక్షమ్మతో పాటు రాముడి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఆలయ చెరువును స్కంద పుష్కరిణి అని పిలుస్తారు.

Share this post with your friends