ఆ బ్రిటీషర్‌ని స్వయంగా శివయ్యే కాపాడట.. అసలేం జరిగిందంటే..

భక్తి భావంతో భగవంతుడిని ప్రార్థించాలే కానీ ఎవరినైనా ప్రాంతీయ, కుల, మతాలతో సంబంధం లేకుండా భగవంతుడు కరుణిస్తాడు. దీనికి ఈ కథే నిదర్శనం. 1879లో బ్రిటీష్‌వారు భారత్‌ను పాలిస్తున్న తరుణంలో వారి సైన్యంలో కల్నల్ మార్టిన్ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. మధ్యప్రదేశ్లోని ‘అగర్ మాల్వా’లో ఆయన విధులు నిర్వహించేవాడు. ఆయనకు తన భార్యకు నిత్యం ఉత్తరాలు రాసే అవాడు ఉండేది. ఓసారి మార్టిన్ పని మీద ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడకు వెళ్లాక కూడా తరచూ ఉత్తరాలు రాయడం మాత్రం మానలేదు. ఎందుకోగానీ కల్నల్ భార్యకు సడెన్‌గా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తన భర్త నుంచి ఉత్తరాలు రావడం ఆగిపోయింది.

తన భర్త ఏమయ్యాడో తెలియక లేడీ మార్టిన్ అగర్ మాల్వాకు వచ్చి అక్కడంతా తిరుగుతుండగా.. ఓ శివాలయం నుంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయి. ఆమెకు ఆ శబ్దాలు ఎంతో ఊరటనివ్వడంతో పాటు అక్కడి ఆలయ పూజారులు చెప్పిన మాటలు సాంత్వన కలిగించాయి. ఆమెను ఆలయ పూజారులు పదకొండు రోజుల పాటు ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. 11 రోజుల పాటు ఈ మంత్రాన్ని లేడీ మార్టిన్ జపించింది. సరిగ్గా 11వ రోజున భర్త నుంచి లేఖ వచ్చింది. తమ సైన్యాన్ని పఠాన్లు చుట్టుముట్టారని.. చావే గతి అనుకున్న తరుణంలో పులి చర్మం ధరించి, త్రిశూలం చేతపట్టిన ఒక భారతీయ యోగి వచ్చి తమను కాపాడాడని తెలిపాడు. మార్టిన్ తిరిగి రాగానే ఆయనకు జరిగిందంతా లేడీ మార్టిన్ వివరించింది. తనను కాపాడేందుకు వచ్చింది శివయ్యేనని మార్టిన్ భావించారట. అప్పటి నుంచి ఇద్దరు శివభక్తులయ్యారు. అలాగే అగర్ మార్టిన్‌లోని శివాలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ కథ నిజమని చెప్పేందుకు అక్కడి ఆలయంలోని శిలాఫలకమే నిదర్శనం.

Share this post with your friends