ఆ ఆంజనేయుడు 400 ఏళ్ల క్రితం దొరికాడట.. అప్పుడు 2 .. ఇప్పుడు 12 అడుగుల ఎత్తు

హిందూమతంలో హనుమంతుడికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హనుమంతుడిని భక్తితో కొలవాలే కానీ కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తాడని నమ్మకం. దీనికి నిదర్శనాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా కమ్రాడ్ గ్రామం. ఇక్కడ 400 ఏళ్ల నాటి హనుమంతుడి ఆలయం ఉంది. ఇక్కడకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలే కానీ తప్పక ఆంజనేయుడు మనం కోరిన కోరికలు తీరుస్తాడట. ఇక్కడి ఆంజనేయుడి గురించి మరో ఆసక్తికర విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఈ ఆంజనేయ విగ్రహం దొరికిన సమయంలో 2 అడుగులు ఉందట. ఇప్పుడు ఆ విగ్రహం ఎత్తు 12 అడుగులు.

బలోద్ జిల్లాలోని కమ్రౌడ్ గ్రామంలో 400 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున కరువు ఉండేదట. అక్కడి ప్రజానీకం కరువు కారణంగా చాలా ఇబ్బందులు పడేవారట. ఆ సమయంలో ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలి భూమిలో కూరుకుపోయింది. కష్టపడి దానిని బయటకు తీశాడు. అనంతరం చూస్తే అక్కడ హనుమంతుడి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి అక్కడ ప్రతిష్టించారు. అనంతరం అక్కడొక ఆలయం కూడా నిర్మించారు. ఈ విగ్రహాన్ని భూ ఫోడ్ హనుమాన్‌జీ అని పిలుస్తారు. ఈ హనుమంతుడు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫేమస్ అయ్యాడు.

Share this post with your friends