మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి.

నాది నిరాజనం వేదికపై…
బుధవారం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ బృందం తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను ఆలపించునున్నారు.

సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.

Share this post with your friends