ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణం వెనుక కథేంటంటే..

మహంకాళి ఉజ్జయిని ఆలయం చాలా ఫేమస్. అసలు ఆ ఆలయం ఎందుకంత ఫేమస్ అయ్యింది? దాని వెనుక కథేంటో తెలుసుకుందాం. అంగ్లేయుల పాలనా కాలంలో సికింద్రాబాద్ మిలిటరీ బెటాలియన్‌లో ఒక బోయిగా పని చేసినవాడు సూరిటి అప్పయ్య. 1813 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్లేగు వ్యాధి ప్రబలింది. జనం పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ఆ సమయంలో అప్పయ్య ఉజ్జయినికి బదిలీపై వెళ్లాడు. అక్కడున్న మహంకాళీ అమ్మవారిని జంటనగరాల్లో జనాలను ఈ విపత్తు నుంచి రక్షిస్తే.. సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహం పెట్టి గుడి కడతానని మొక్కుకున్నాడు. అయినా సరే తగ్గలేదు. అనంతరం అప్పయ్య తిరిగి సికింద్రాబాద్‌కు బదిలీపై వచ్చాడు.

సూరిటి అప్పయ్య తన మాట తప్పకుండా 1815 జులైలో ఒక్కడే కర్రతో చేసిన ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని లష్కర్‌లోని ఓ ఖాళీ ప్రదేశంలో ప్రతిష్టించాడు. ఆపై చిన్న గుడి కూడా కట్టించాడు. అయితే గుడి నిర్మాణ సమయంలో పాత బావిని బాగు చేస్తుండగా మాణిక్యాలమ్మ విగ్రహం దొరికిందట. దానిని ఆ కర్ర స్థానంలో పెట్టించాడట. ఆ తర్వాతి కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య, ఆయన తదనంతరం సంజీవయ్య కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య, అతని వారసుడు కిష్టయ్య వరసగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. అప్పటి నుంచి పెద్ద ఎత్తున మహంకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తూ వస్తున్నారు.

Share this post with your friends