హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ వేణుగోపాల స్వామి

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ ఆరవ రోజుకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇక ఇవాళ సాయంత్రం గజ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఐదవ రోజు ఆదివారం ఉదయం 7.30 గంటలకు పల్లకిలో మోహిని అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు ఊరేగారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీన ముగియనున్నాయి. ఆ రోజున ఉదయం స్వామివారికి చక్రస్నానం ఉంటుంది. అనంతరం స్వామివారికి ధ్వజారోహణం నిర్వహించనున్నారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా , కార్వేటినగరంలో ఉన్న హిందూ – వైష్ణవ దేవాలయం ఇది. గర్భగృహంలో రుక్మిణి, సత్యభామ సమైతుడై శ్రీ వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు . ఈ విగ్రహాలు నారాయణవనం ఆలయం నుంచి తీసుకువచ్చారు. ఈ ఆలయంలోనే సీతారాములతో పాటు లక్ష్మణ, ఆంజనేయ, పార్థసారథి, రేణుకా పరమేశ్వరి, అవనాక్షమ్మ ఉపవిగ్రహాలు ఉన్నాయి.

Share this post with your friends