లాఫింగ్ బుద్దా గురించి అందరికీ తెలుసు. చాలా మంది ఇళ్లలో దీనిని కచ్చితంగా పెట్టుకుంటారు. లాఫింగ్ బుద్దా ఇంట్లో ఉంటే డబ్బుకు ఏ లోటు ఉండదని నమ్ముతారు. అంతే కాకుండా లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే ప్రశాంతత చేకూరుతుందంటారు. అయితే లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అలాగే లాఫింగ్ బుద్ధాను మనం కొనుక్కోకూడదు. వేరే ఎవరైనా గిఫ్ట్‌గా ఇవ్వాలి. ఇలా కొన్ని నియమాలున్నాయి. అవేంటో చూద్దాం.
ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెద్దగా ఉండవట. ఇల్లంతా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందట. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి స్థానముండదని అంటారు. అయితే దీనిని కచ్చితంగా పడమర దిక్కులోనే ఉంచాలి. ఇలా ఉంచితే దీర్ఘకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆగ్నేయ దిశలో కూడా ఉంచవచ్చు. ఇలా ఉంచితే డబ్బుకు లోటుందని అంటారు. సంతానం లేని వారు లాఫింగ్ బుద్దాను ఇంట్లో పెట్టుకోవాలని చెబుతారు. అలాగే ఈ విగ్రహాన్ని ఎప్పుడూ ఇంట్లో ఎత్తైన ప్రదేశాల్లో పెట్టాలి.