జూన్ 2వ తేదీ ఆదివారం ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుందని, హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2823 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని చెప్పారు. హనుమంతుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లారో అదేవిధంగా పండితులు నిరంతరాయంగా 18 గంటల పాటు పారాయణం చేస్తారని తెలిపారు.
జాపాలి మహర్షి త్రేతాయుగంలో ఆకాశగంగలో తపస్సు చేయడంతో హనుమంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చారని, అనంతరం ఇక్కడి జాపాలి తీర్థంలో హనుమంతుని విగ్రహాన్ని మహర్షి ప్రతిష్టించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇక్కడి స్వామివారిని, స్వామివారి జన్మస్థలమైన ఆకాశగంగలో మాతృమూర్తి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామిని భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.