కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు

దేవాలయానికి వెళితే తప్పనిసరిగా దేవుడికి కొబ్బరికాయ కొట్టే వస్తాం. భగవంతునికి మొక్కి కొబ్బరికాయ కొడితే మన కష్టాలన్నీ తొలిగిపోయి సుఖశాంతులతో ఉంటామని భావిస్తుంటాం. అయితే కొబ్బరి కాయ కొట్టడానికి కొన్ని నియమాలున్నాయి. ఇంట్లో అయినా.. ఆలయంలో అయినా ఆ నియమాలను అనుసరిస్తూ కొడితే ఫలితం బాగుంటుంది. ఇక కొబ్బరికాయను కొట్టడానికి నియమాలేంటో చూద్దాం. కొబ్బరికాయను శుభ్రంగా కడిగి పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకుని కొట్టాలి. అలాగే కొబ్బరి కాయను కొట్టే రాయి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి.

కొబ్బరికాయను కొట్టే సమయంలో కూడా కాస్త ఎత్తు నుంచి కొట్టాలి. కొబ్బరికాయ సగానికి పగిలితే శుభంగానూ.. లేదంటే కొబ్బరికాయ లోపల నల్లగా ఉంటే అశుభంగానూ భావిస్తుంటారు. శివాయ నమహ అంటూ 108 సార్లు జపిస్తే ఆ దోషం పోతుంది. కొబ్బరికాయ కొట్టేముందు కాయ వెనుక ఉన్న పీచు తీయకూడదు. కొట్టిన తర్వాత మాత్రమే తీయాలి. అయితే కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులను త్రినేత్రుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పిస్తే స్వామి వారి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపలి కొబ్బరి తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా, అందులో పువ్వు వచ్చినా చాలా సంతోష పడతారు.

Share this post with your friends