గంగా సప్తమి రోజు పాటించాల్సిన నియమాలు..

గంగా సప్తమి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ హిందువులు దీనిని చాలా పవిత్రంగా చూస్తారు. 2024 సంవత్సరంలో గంగా సప్తమి పండుగను 14 మే 2024 మంగళవారం జరుపుకోనున్నారు. గంగాదేవి పునర్జన్మ పొందిన రోజే గంగా సప్తమి అని పండితులు చెబుతారు. వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి తిథినాడు జాహ్నవి మహర్షి చెవి నుంచి గంగను విడుదల చేశారు. అలాగే గంగాదేవిని జహ్న మహర్షి కుమార్తె జాన్వి అని కూడా పిలుస్తారు. ఈ కథ ప్రకారం గంగా సప్తమని జహ్న సప్తమి అని కూడా అంటారు. గంగా సప్తమి నాడే గంగాదేవి భూమి పైకి వచ్చిందని చెబుతారు.

అయితే గంగా సప్తమి నాడు కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రోజున కొన్ని పరిహారాలు చేస్తే.. ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. ఆ పరిహారాలేంటో చూద్దాం. గంగా సప్తమి రోజున స్నానం, తపస్సు, ధ్యానం చేయాలి. గంగా స్నానం చేయలేని వారు గంగాజలాన్ని నీటిలో కలుపుకుని చేయాలి. ఇలా చేస్తే మోక్షం కలుగుతుందని నమ్మకం. వివాహం ఆలస్యమైతే గంగాజలంలో 5 బిల్వ పత్రాలు వేసి.. ఆ నీటితో భోలేనాథుడికి జలాభిషేకాన్ని చేయాలి. ఇలా చేస్తే శివుడు, గంగా ఇద్దరూ సంతోషిస్తారు. దీంతో వివాహం తప్పక అవుతుందట. గంగా సప్తమి రోజున గంగలో పాలు పోసి, గంగామాత మంత్రాలను జపిస్తే మనకు ఏ పనిలో అయినా తప్పక విజయం సిద్ధిస్తుందట.

Share this post with your friends