తిరుమలలో ఒకసారి బ్రహ్మోత్సవ సమయంలో గ్రామంలో మహాగ్నిజ్వాల రగిలి గ్రామమంతా ఆహుతి అయింది. విధి నిర్వహణలో దోషం ఏమైనా జరిగిందేమోనని అర్చక స్వాములు భయపడి క్షమించమని శ్రీ మలయప్ప స్వామివారిని కోరారు. ఆ సమయంలో ఒకరికి పూనకం వచ్చి ఇక తననెప్పుడు ఉత్సవములలో ఉపయోగింపరాదని ఆ పర్వత మైదానంలో ఒక మూర్తి కలదనీ, ఆ మూర్తిని ఉత్సవములలో ఉపయోగింపవలసినదనీ స్వామివారు ఆనతిచ్చారు. స్వామివారి ఆనతి ప్రకారం వెదకగా, దేవేరుల తోకల స్వామివారి మూర్తి లభించింది. మలై అంటే పర్వతం. పర్వతము నందు లభించిన స్వామి అనే పేరు వచ్చింది. 1399వ సంవత్సర ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇతరమహర్షులు :
స్వామివారి అయిదు మూర్తులుగాక, సన్నిధిలో సుదర్శన చక్రం వుంది. ఈస్వామిని చక్రత్తాళ్వారు అని అంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో అంకురార్పణ సమయంలో ధ్వజస్తంభము వద్దకు తీసుకుని వస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానంలో చక్రత్తాళ్వారు స్వామిని పుష్కరిణీకి వేంచేపు చేస్తారు. స్వామివారి సన్నిధిలో శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహములు వున్నాయి.
