పంచాంగం గురించి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఉగాది సమయంలో పంచాంగ శ్రవణాన్ని మనం వింటూనే ఉంటాం. అన్ని ఆలయాల్లోనూ పంచాంగ శ్రవణం ఉగాది పండుగ నాడు జరుగుతుంది. పంచాంగం అంటే కాల నిర్ణయానికి ఉపయోగపడే ఐదు అంగాలు లేదా ముఖ్యమైన భాగాలు. అవి వచ్చేసి తిథి, వారం, నక్షత్రం, యోగం, తిథి. ఈ ఐదింటి గురించి తెలుసుకుందాం.

తిథి: సూర్య, చంద్రుల గతుల ఆధారంగా తిథి అనేది ఏర్పడుతుంది (ఉదా: పాడ్యమి, విదియ, తదియ మొదలైనవి).
వారం: దీని గురించి మనకు తెలిసిందే. ఇది రోజులను సూచిస్తుంది (ఉదా: సోమవారం, మంగళవారం మొదలైనవి).
నక్షత్రము: చంద్రుడు ఆకాశంలో సంచరించే మార్గాన్ని 27 విభాగాలుగా విభజించారు.. అవే నక్షత్రాలు (ఉదా: అశ్విని, భరణి మొదలైనవి).
యోగం: సూర్యుడు, చంద్రుల దూరాల (రేఖాంశాల) కలయిక ద్వారా ఏర్పడే ప్రత్యేక స్థితిని యోగంగా పేర్కొంటారు.
కరణం: తిథిలో సగం భాగాన్ని కరణం అంటారు (ఉదా: బవ, బాలవ, కౌలవ మొదలైనవి).
ఈ ఐదింటిని కలిపి పంచాగాన్ని తయారు చేయడం జరుగుతుంది. పండుగలు, శుభకార్యాలు, మంచి సమయాలు (ముహూర్తాలు) నిర్ణయించడానికి ఇది ప్రాతిపదికగా చెబుతారు.
