తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని వీధులు, కూడళ్లు, ప్రాంతాలకు వేదాలు, ఆళ్వార్లు, భక్తాగ్రేసరుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం కూడా తీసుకుంది. కమిటీ ప్రతిపాదించిన కొత్త పేర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మాడవీధులు.. ప్రాంగణాలు
తూర్పు మాడవీధి: రుగ్వేద మార్గం
దక్షిణ: యజుర్వేద మార్గం
పశ్చిమ: సామవేద మార్గం
ఉత్తర: అధర్వణవేద మార్గం

బేడీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతం: సాళువ నరసింహరాయల ప్రాంగణం
ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం
భగవద్రామానుజాచార్య ప్రాంగణం.
మూవింగ్ బ్రిడ్జి నుంచి సహస్ర దీపాలంకరణ సేవ వరకు: తిరుమలనంబి ప్రాంగణం
ఆలయం వెనుక భాగం: అనంతాళ్వార్ ప్రాంగణం
