వైభవంగా కార్వేటి నగరం శ్రీవేణుగోపాల స్వామివారి రథోత్సవం

కార్వేటి నగరం శ్రీవేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకూ జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి రథోత్సవం జరిగింది. ఇవాళ సాయంత్రం స్వామివారు అశ్వవాహనంపై ఊరేగనున్నారు. కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన‌ మంగళవారం ఉదయం 7:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులను కటాక్షించారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. మంగళవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారు వెన్నెముద్ద కృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి కూడా వాహన సేవలన్నీ ఉదయం, సాయంత్రం వేళల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends