పరశురాముడి గొడ్డలి ఇంకా ఆ ఆలయంలోనే ఉందట..

పరుశురాముడి గొడ్డలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరుశురాముడిని విష్ణు మూర్తి అవతారంగా భావిస్తూ ఉంటారు. సీతా స్వయంవర సమయంలో శ్రీరాముడు శివుని విల్లు విరిచి సీతాదేవిని వరిస్తాడు. శివుడి ధనస్సుని ఎక్కుపెట్టమని చెప్పినప్పుడు.. శ్రీ రాముడు తీగను విరిచాడు. ఆ విషయం పరుశురాముడికి తెలియడంతో కోపోద్రిక్తుడై స్వయంవరం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడట. అక్కడ రాముల వారిని చూసి ఆయన కూడా తనకు మాదిరిగా విష్ణుమూర్తి అవతారమని తెలుసుకుని తన గర్వానికి సిగ్గుపడతాడు. ఆ వెంటనే తన పరశువు అంటే భారీ గొడ్డలిని లుచుట్పట్ అడవిలోని ఒక పర్వతంపై భూమిలో పాతిపెట్టాడు.

ఈ గొడ్డలి పాతి పెట్టిన ప్రదేశం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా డుమ్రీ బ్లాక్‌లోని లుచుట్‌పట్ కొండలపై ఉంది. ఉంది. ఈ ప్రదేశం తంగినాథ్ ధామ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ పరశురాముడు ఆ పాతి పెట్టిన ప్రదేశంలోనే గొడ్డలి ఉందని నమ్ముతారు. జార్ఖండ్ స్థానిక గిరిజన భాషలో గొడ్డలిని టాంగి అంటారు. అందుకే ఆ ప్రాంతానికి తంగినాథ్ ధామ్ అని పేరు వచ్చింది. గుమ్లా జిల్లాలోని దట్టమైన అడవిలో తంగినాథ్ ఆలయాన్ని రాళ్లతో నిర్మించారు. ఇక్కడ 108 శివలింగాలతో కూడిన దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. అయితే ఈ గొడ్డలి పాతిపెట్టడం వెనుక మరో కథ కూడా ఉంది. తల్లిని హత్య చేసిన పాపం నుంచి విముక్తి పొందేందుకు పరశురాముడు తంగినాథ్ ధామ్‌లో భారీ త్రిశూలం ఆకారంలో ఉన్న గొడ్డలిని భూమిలో పాతిపెట్టాడట. ఆపై శివుడిని స్మరిస్తూ తపస్సు చేశాడట. దీంతో వివుడ ప్రత్యక్షమై తల్లి హత్యా పాతకం నుంచి పరశురాముడికి విముక్తి కల్పించాడట.

Share this post with your friends