పున్నమి వేళ పండు వెన్నెల్లో కన్నుల పండువగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం

ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భాజా భజంత్రాలు, డప్పు వాయిద్యాలు.. పున్నమి వెలుగులో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కోదండ రాముని కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా జరిపించింది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా పున్నమి నాటి పండు వెన్నెల్లో ఒంటిమిట్ట రామయ్య కల్యాణం చాలా ఆహ్లాదకరంగా జరిగింది.

ఒంటిమిట్ట రామయ్య ఆలయంలో శ్రీరామనవమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకూ జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి కల్యాణ మహోత్సవం ఒక కీలక ఘట్టం. ఇక రేపు అంటే 23న స్వామివారి రథోత్సవం, 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగం నిర్వహిస్తారు. దీంతో ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు.

Share this post with your friends