హనుమంతుడి ఆలయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఆలయం.. హైదరాబాద్‌లోని తాడ్‌బండ్ వీరాంజనేయస్వామి దేవాలయం. సికింద్రాబాద్‌లోని సిక్ విలేజ్‌లో ఉంటుందీ ఆలయం. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతుంటాయి. పెద్ద ఎత్తున దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ మనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు హోమం, యాగాలు నిర్వహిస్తారు. ఇక్కడ వీరాంజనేయ స్వామి వారు స్వయంభువుడని చెబుతారు.
ఈ దేవాలయ అభివృద్ధికి మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు చాలా కృషి చేశారు. ఈ ఆలయంలో హనుమంతుడు వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే ఎందుకు మిగిలిపోయాడు? వంటి విశేషాలన్నింటినీ ఓ శిలాఫలకంపై చెక్కారు. హనుమంతుడి జీవితంలో పెద్దగా ఎవరికీ తెలియని కీలక ఘట్టాన్ని వివరించే యత్నం చేశారు. అలాగే గ్రానైట్‌ను ఉపయోగించి స్వామివారి గర్భాలయాన్ని నిర్మించారు. ఇక ముఖమండపమైతే విశాలంగానూ.. విమాన గోపురం, మహారాజ గోపురాలతో అద్భుతంగా ఉంటుంది. మంగళ, శని వారాల్లో భక్తుల రద్దీ పెద్ద ఎత్తున ఉంటుంది.