జీవితంలో అన్ని రకాల వృద్ధికి మోహినీ ఏకాదశి సరైన సమయం.. ఆ రోజున ఏం చేయాలంటే..

హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజును విష్ణువుకు అంకితమివ్వడం జరిగింది. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాం. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి మే 18, 2024న ఉదయం 11:23 గంటలకు ప్రారంభమై.. మే 19, 2024 మధ్యాహ్నం 01:50 గంటలకు ముగుస్తుంది కాబట్టి మే 19న మోహిని ఏకాదశిని జరుపుకుంటాం. మరి ఈ రోజున ఏం చేస్తే ఏం జరుగుతోందో చూద్దాం. కోరిన కోరిక ఏదైనా సరే తీరాలంటే.. మోహినీ ఏకాదశి నాడు కొత్త పసుపు రంగు వస్త్రానికి అంచులకు కుంకుమ అద్ది శ్రీహరి ఆలయంలో సమర్పించి కోరికను తీర్చమని అడగాలి. ఇలా చేస్తే తప్పక కోరిక నెరవేరుతుందని నమ్మకం.

జీవితంలో పురోగతి కోసం.. నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలిపి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం ధూప, దీపాలతో విష్ణుమూర్తిని పూజిస్తే తప్పక భగవంతుని అనుగ్రహం లభిస్తుందట. ఇక వ్యాపారంలో పురోగతి కోసం ఒక బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్మానించి శుష్టుగా భోజనం పెట్టాలి. అనంతరం శక్తి మేరకు తాంబూలం, దక్షిణ ఇస్తే వ్యాపారంలో పురోగతి తప్పక లభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత కోసం విష్ణుమూర్తిని పూజించి ఆపై శ్రీ విష్ణు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. కెరీర్‌లో విజయం సాధించాలంటే.. విష్ణువుకు వెన్న, పంచదార, ఏదైనా స్వీట్‌ను నైవేద్యంగా పెట్టి.. విష్ణుమూర్తి విగ్రహం ముందు కూర్చొని ‘ఓం నమో భగవతే నారాయణ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు. కెరీర్‌లో వృద్ధి తప్పక ఉంటుందట.

Share this post with your friends