అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మధవేశ్వరీ ఆలయం ప్రత్యేకత ఏంటంటే..

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా మధవేశ్వరీ ఆలయం అలరారుతోంది. ఇది గంగ, యమున, సరస్వతి నదుల కూడలి ప్రదేశం ప్రయాగలో ఉంది. ప్రయాగను హిందూవులుగా అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తుంటారు. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా.. ముంజేయి ఇక్కడ పడిందట. ఇక్కడ అమ్మవారి విగ్రహమంటూ ఏమీ ఉండదు. ఒక నలుచదర పీఠం మాత్రమే ఉంటుంది. దానిపైన ఒక గుడ్డతో తయారు చేసిన హుండీని వేలాడదీశారు.

ఇక దాని కింద ఒక ఉయ్యాల ఉంటుంది. భక్తులు కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ప్రయాగలో త్రివేణి సంగమం ఉంది కాట్టి అక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందట. కాశీ యాత్ర చేసినవారు తప్పక ఇక్కడ స్నానమాచరిస్తారు. గంగా తీర్థాన్ని సైతం ఈ త్రివేణి సంగమం నుంచే ఇంటికి తీసుకెళతారు. ఇక స్థానికులు అమ్మవారిని అలోపిదేవీగా కూడా పిలుస్తారు. అలోపి అంటే మాయమవటం అని అర్థం. అప్పట్లో ప్రయాగ అటవీ ప్రాంతం. అక్కడి ఒక పెళ్లికూతురుని అమ్మవారు దొంగల బారి నుంచి రక్షించి మాయం చేసిందట. అందుకే అమ్మవారిని అలోపి అంటారు.

Share this post with your friends