బంగారు పర్వతాన్ని సృష్టించి మరీ కర్ణుడి గొప్పతనాన్ని అర్జనుడికి చెప్పిన శ్రీకృష్ణుడు..

శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరికైనా ఏదైనా చెబితే వినకుంటే ప్రాక్టికల్‌గా నిరూపిస్తూ ఉంటాడు. అలా అర్జనుడికి కర్ణుడి గొప్పతనాన్ని చెప్పాడు. కర్ణుడిని దాన కర్ణుడని అంటారు. శ్రీకృష్ణుడు కూడా కర్ణుడి ప్రస్తావన వస్తే దానకర్ణుడనే అంటుండేవాడు. కానీ అలా కర్ణుడిని కీర్తించడం అర్జనుడికి నచ్చలేదు. ఈ విషయాన్నే శ్రీకృష్ణుడికి అర్జనుడు నేరుగా చెప్పాడు. ఇక అర్జనుడికి నచ్చజెప్పడం సరికాదని భావించిన కృష్ణుడు కర్ణుడి గొప్పతనాన్ని నేరుగా అర్జనుడికి చూపించాలనుకున్నాడు. దీనికోసం బంగారు పర్వతాన్ని సృష్టించి.. అర్జనుడికి చూపించి. ఈ పర్వతాన్ని సాయంత్రం లోపు ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా దానం చేయాలని చెప్పాడు.

అలా చేస్తే కర్ణుడికంటే గొప్పవాడవని చెబుతానని శ్రీకృష్ణుడు అంటాడు. వెంటనే అర్జనుడు ఊరంతా చాటింపు వేయించి మరీ బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నట్టు చెబుతాడు. అంతే ఊరి జనమంతా క్షణాల్లో కొండ వద్దకు చేరుకుంటాడు. ఇక అర్జనుడు దానం చేయడం ఆరంభిస్తాడు. ఎంత దానం చేసినా పర్వతం తరగదు. సాయంత్రం అవుతుంది. పర్వతం సగం కూడా దానం చేయడానికి అవదు. ఇక అర్జునుడు తాను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడిని పిలిచి బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోగా దానం చేయమంటాడు. కర్ణుడు అంత సమయం ఎందుకని అటుగా వెళుతున్న ఇద్దరిని పిలిచి ఈ పర్వతాన్ని చెరో సగం పంచుకోమని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జనుడితో నీకు కర్ణుడికి తేడా అర్థమైందా? అని ప్రశ్నిస్తాడు. అందుకే దానంలో కర్ణుడిని కొనియాడక తప్పదని చెప్పడంతో అర్జనుడు సైలెంట్ అయిపోతాడు.

Share this post with your friends