వంటగదిలో ఈ వస్తువులకు ఏ మాత్రం కొరత ఏర్పడినా కష్టమే.. అవేంటంటే..

లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి. నిజానికి లక్ష్మీదేవి ఇంట్లో అయితే వంటగదిని ఆవాసంగా చేసుకుంటుందట. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు. అలాగే కొన్ని నియమాలను సైతం తప్పక పాటించాలి. వాటిలో ఏ లోటు జరిగినా లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్లిపోతుందని అంటారు. మరి ఆ నియమాలేంటంటే.. వంటగదిలో నిత్యం కొన్ని వస్తువులు నిండుగా ఉండేలా చూసుకోవాలి. అవేంటంటే.. బియ్యం. మనకు ఇది నిత్యావసరం కాబట్టి బియ్యం ఇంట్లో ఉండటం సర్వసాధారణం. అయితే ఈ బియ్యం పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదట. ఖాళీ అయిపోతుంటే వెంటనే నింపుతూనే ఉండాలట. లేదంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.

బియ్యం తర్వాత స్థానంలో మనం తప్పక వంటగదిలో కొరత రానివ్వకుండా ఉంచుకోవాల్సిన వస్తువు పసుపు. పసుపును చాలా పవిత్రంగా భావిస్తాం. ప్రతి ఒక్క శుభకార్యంలోనూ పసుపునకు పెద్ద పీట వేస్తూ ఉంటాం. కాబట్టి పసుపు విషయంలో ఎలాంటి లోటు రానివ్వకూడదు. ఇలా చేస్తే శుభ కార్యాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉప్పు కూడా వంటగదిలో నిండుకోకూడదు. ఉప్పు కొరత కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందట. పిండి కూడా వంటగదిలో నిత్యం ఎక్కువ పరిమాణంలో ఉంచాలట. పిండి త్వరగా అయిపోతే మళ్లీ వెంటనే పిండి డబ్బాను నింపేసుకోవాలట. లేదంటే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందట. పిండి కొరత కారణంగా వ్యక్తి గౌరవానికి లోటు జరుగుతుందట.

Share this post with your friends