మంగళవారం దుర్గమ్మను పూజస్తే మేలు.. పూజా విధానం ఏంటంటే..

మంగళవారం రోజున దుర్గాదేవికి పూజిస్తే అవివాహితులకు వివాహ ప్రాప్తి, వివాహితులకు దీర్ఘ సుమంగళితనం, సంతానం కోరుకునే వారికి సత్సంతానం కలుగుతాయట. మరి ఆ పూజలు ఎలా చేయాలో చూద్దామా? రాహుకాలమనేది రోజులో 90 నిమిషాల పాటు ఉంటుంది. అలాగని ప్రతిరోజూ ఒకే సమయంలో రాహుకాలం రాదు. రోజును బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది మంగళవారం పూట ఏ పని చేయరు కానీ మంగళవారాన్ని జయవారం అని కూడా అంటారు. విద్య, వైద్యం వంటి ముఖ్యమైన పనులకు మంగళవారమే మంచిదట.

ఇక మంగళవారం రాహుకాల పూజ చేయాలనుకున్నవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి పూజ చేసుకోవాలి. అనంతరం అమ్మవారి సమక్షంలో మనసులోని కోరికను చెప్పుకొని రాహుకాల పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. రాహుకాలం పూర్తయ్యాక అమ్మవారి ఆలయానికి వెళ్లాలి. ఆలయంలో ఒక చోట నేలను శుభ్రపరిచి పద్మాకారంలో ముగ్గు వేసి.. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. అనంతరం నిమ్మకాయను రెండుగా కోసం రసాన్ని తీసేసి ప్రమిదలా చేసి నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యాక అమ్మవారి పేరుపై అర్చన జరిపించుకుని అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం విరమించాలి.

Share this post with your friends