దీపావళి వేళ గోవులతో తొక్కించుకునే సంప్రదాయం.. ఎక్కడంటే..

మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఆచారముంది. దీపావళి సందర్భంగా ఉజ్జయిని జిల్లాలో దీపావళి సందర్భంగా భక్తులు ఆవులతే తొక్కించుకుంటారు. ఇక్కడి నినాదం ‘మధ్యప్రదేశ్ అజబ్ హై, సబ్సే గజబ్ హై’ అనే నినాదాన్ని అక్కడి పౌరులు ఇస్తుంటారు. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలోని బద్‌నగర్ తహసీల్‌లోని భిద్వాడ్ గ్రామంలో ఈ విశిష్ట సంప్రదాయం ఉంటుంది. ఇక్కడ ఒక మత సనమౌప ఆచారంగా దీపావళి పండుగ రోజు తర్వాత గోపూజ చేస్తారు. అనంతరం జరిగే కార్యక్రమం ఆసక్తికరం.

దీపావళి పండుగ అనంతరం గోపూజ చేసిన తర్వాత గ్రామస్తులంతా నేలపై పడుకుంటారు. అనంతరం పడుకున్న భక్తుల పైకి ఆవులను వదులుతారు. గోవులలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని హిందువులంతా భావిస్తుంటారు. కాబట్టి తమపై గోవులు నడుచుకుంటూ వెళితే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడి ప్రజలు ఐదు రోజుల పాటు ఉపవాసం ఉండటంతో పాటు దీపావళికి ఒకరోజు ముందు గ్రామ దేవత ఆలయంలో బస చేస్తారు. దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఆ తరువాత ప్రజలు నేలపై పడుకుని తమను తొక్కుకుని వెళ్లేలా చేస్తారు. అయితే అలా గోవులు తొక్కినా కూడా ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదట. పైగా గోవు తొక్కిందంటే వారి చాలా ఆనందం వ్యక్తం చేస్తారు.

Share this post with your friends