పిల్లి అపశకునమా? ఈ ఆచారం ఎందుకొచ్చింది?

శుభకార్యాలకు వెళుతున్న.. ఏదైనా పనిపై బయటకు వెళుతున్నా పిల్లి ఎదురస్తే తెగ కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే అడుగు ముందుకు పడదు. ఇక పని జరగనట్టేనని ఫిక్స్ అయిపోతారు. పంచ మహాపాతకాలు చుట్టుకున్నంతగా భావిస్తూ ఉంటారు. మరి నిజంగానే పిల్లి ఎదురొస్తే పని జరగదా? శుభకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయా? అసలుపిల్లి శకునం ఎందుకు మంచిది కాదు? అనే విషయాలను తెలుసుకుందాం. ఏ సంప్రదాయమైనా మన పూర్వీకుల నుంచి వచ్చిందే. అప్పట్లో ప్రయాణాలకు కార్లు, బస్సులు, రైళ్లు వంటివి అందుబాటులో ఉండేవి కాదు. ఎండ్ల బండి మీదో.. గుర్రాల మీదో ప్రయాణించాల్సి వచ్చేది. రోడ్లు కూడా ఉండేవి కాదు.

పచ్చని చెట్లతో ఒక రకంగా అన్ని ప్రాంతాలు అటవీమయంగానే ఉండేవి. ఆ అడవిలో చీకట్లో వెళుతుంటే పిల్లి జాతికి చెందిన పులులు, సింహాలు ఎదురు పడేవి. వాటిని చూసి ఎడ్లు కంగారు పడి.. భయపడి ఆగిపోయేవి. ఇక ఆ తరువాత ఏం జరిగేదనే విషయం పక్కనబెడితే అప్పటి నుంచి ఈ జాతికి చెందిన జంతువులు ఎదురు పడితే అపశకునంగా భావించడం ప్రారంభమైంది. ఇక ఆ తరువాత మంచిగా రోడ్లు పడి టెక్నాలజీ బాగా డెవలప్ అయి బస్సులు, ట్రైన్లే కాదు.. ఫ్లైట్‌లలో తిరుగుతున్నా కూడా ఈ సంప్రదాయాన్ని మాత్రం మనం విడువడం లేదు. ఇప్పుడు ఇతర దేశాల్లోనే కాదు.. మన దేశంలోనూ కొందరు పిల్లులను పెంపుడు జంతువుల మాదిరిగా పెంచుకుంటున్నారు.

Share this post with your friends