గుజరాత్‌లో లభ్యమైన పాము శిలాజం.. వాసుకిదేనంటున్న భక్త జనం..

మనకు వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు రావడం సహజం. అసలు నిజంగానే క్షీరసాగర మథనం జరిగిందా? వాసుకిని తాడుగా వాడి సముద్రాన్ని చిలికారా? నిజంగానే అమృతాన్ని బయటకు తీశారా? అంటే అదంతా నిజమో కాదో కానీ పురాణాల్లో చెప్పిన పాము భూమిపై సంచరించిందనైతే చెబుతున్నారు. గుజరాత్‌లో శాస్త్రవేత్తలకు పాము శిలాజాలు లభించాయి. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు పాముకి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు. దొరికిన పాముకి వాసుకి అన్న పేరు ఎందుకు పెట్టా్ల్సి వచ్చిందనేది ఆసక్తికరంగానూ.. చర్చనీయాంశంగానూ మారింది.

ఆ పాము 4.7 కోట్ల ఏళ్ల క్రితం నాటిదని పరిశోధనల్లో తేలింది. 50 అడుగుల పొడవు.. 1000 కేజీల బరువు ఉన్నట్టుగా గుర్తించారు. ఇది గుజరాత్‌లో శాస్త్రవేత్తలకు లభించిన అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజం. దీనికే వాసుకి అని పేరు పెట్టారు. అయితే ఇది పురాణాల్లో చెప్పిన వాసుకియేనని.. ఇంత పెద్ద పాము కాబట్టే నాడు కవ్వంగా చేసుకుని సముద్రాన్ని చిలికారని అంతా చెప్పుకుంటున్నారు. భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టినప్పటికీ.. ఈ పేరుకు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యాన్ని అక్కడి వారంతా గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ పాము శిలాజం గుజరాత్‌లోని ఓ ప్రొఫెసర్‌కు 2005లోనే లభ్యమైంది. అప్పటి నుంచి పరిశోధనలు కొనసాగుతున్నాయి. తొలుత మొసలికి చెందిన శిలాజమనుకున్నారు. ఆ తరువాత పరిశోధనల్లో పాముకు సంబంధించిన శిలాజమని తేలింది.

Share this post with your friends