జగన్నాథ రథయాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలు..

ఒడిశాలో జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ రథ యాత్ర దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుగుతుంది. అంటే ఈ ఏడాది జూన్ 7 నుంచి అన్నమాట. స్వామివారి రథాన్ని లాగిన వారికి మోక్షం తప్పక లభిస్తుందట. దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. జగన్నాథుడిని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. స్వామివారు రథయాత్రలో భాగంగా అన్నాచెల్లెళ్లతో కలిసి బయలుదేరుతాడు. ఒక రథంపై అన్న బలభద్రుడితోనూ.. చెల్లెలు సుభద్రతో ఒక రథంపై కలిసి బయలు దేరుతారు. ఇక ఈ రథాలను వేప, హంసి చెట్ల చెక్కతో తయారు చేస్తారు.

భగవాన్ జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల రథాలు వేప, హంసి చెట్ల చెక్కతో తయారు చేస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే రథాల తయారీలో మేకులు సహా ఎలాంటి లోహాన్నీ వినియోగించరు. అలాగే ఈ రథాన్ని గత కొన్నేళ్లుగా కొన్ని కుటుంబాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. సగటున 13 మీటర్లు అంటే 42 అడుగుల ఎత్తుతో ఈ రథాలను తయారు చేస్తారు. ఇక రథానికి చెక్క కోసం వినియోగించే చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది. ఇక రథాల ప్రయాణంలో సైతం ఒక నియమ ప్రకారం కదులుతాయి. బలభద్రుడి రథం ప్రయాణంలో ముందుభాగంలో ఉంటే.. సోదరి సుభద్ర రథం మధ్యలోనూ.. జగన్నాథుని రథం వెనుక ఉంటుంది.

Share this post with your friends