రామాయణాన్ని వాల్మీకి అలా మొదలు పెట్టారట..

వాల్మీకి మహా ముని ఆశ్రమవాసంలో భాగంగా సంధ్యకు గంగానదీ తారానికి బయలుదేరారట. ఆయన శిష్యుడైన భరద్వాజుడు వస్త్రాలను తీసుకుని వెంట నడిచాడట. గంగానదికి వెళ్లే మార్గమధ్యంలో తామస నది నిర్మలంగా ఉండటాన్ని చూసి అక్కడే స్నానం చేయాలని అనుకున్నారు. స్నానానికి నదిలోకి దిగుతూ వాల్మీకి ఒక క్రౌంచ పక్షి జంట సంగమించడం చూశారట. అది చూసి సంతోషించారట. అంతలోనే ఓ బోయవాడు మగ పక్షిని బాణంతో కొట్టడంతో అది చనిపోయింది. అది చూసిన ఆడపక్షి బాధ భరించలేక అది కూడా మరణించింది.

దీనిని చూసిన వాల్మీకి మనసు శోకసంద్రంలో మునిగిపోయిందట. అదే తరుణంలో ఆ బోయవానిపై విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే బోయవడిని శపిస్తూ ‘‘మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥ యత్రౌచమిథునాదేకమవధీః కామమోహితం॥’’ అనే శ్లోకం చదివారట. దాని అర్థం ఏంటంటే.. ఓ కిరాతకుడా నువ్వు ఎప్పటికీ అపకీర్తి పాలవుతావు అని. వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన మొదటి శ్లోకం అదేనని అంటారు. ఆ తరువాతనే రామాయణ మహా కావ్యాన్ని వాల్మీకి ప్రారంభించారని చెబుతుంటారు.

Share this post with your friends