సోమవారం నాడు శివుడిని ఇలా పూజిస్తే సమస్యలన్నీ మాయం..

సోమవారం శివున్ని ఆరాధించుకుంటూ ఉంటాం. ఈ రోజు శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. సోమవారం రోజున శివున్ని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ రోజు భోళా శంకరుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్ర మంత్రం పఠిస్తూ శివునికి అభిషేకం చేయాలి. దీని వలన జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఇవాళ కనుక రావి చెట్టు కింద శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం నాడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి ఆవుపాలు, నల్ల నువ్వులు సమర్పిస్తే తప్పక ప్రయోజనం ఉంటుందట. అనంతరం మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయట. వివాహం కుదరక ఇబ్బంది పడుతున్న వారు సైతం 11 వారాల పాటు సోమవారం నాడు సూర్యోదయ సమయంలో కుంకుమ కలిపిన జలంలో శివయ్యను అభిషేకించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పిస్తే తప్పక వివాహమవుతుందట. అప్పుల బాధలున్నా కూడా సోమవారం ఆవుపాలతో శివునికి అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించి బిల్వాష్టకం 11 సార్లు పఠించాలట. ఇలా 11 సోమవారాలు చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయట.

Share this post with your friends