భారతదేశంలో దేవాలయాలకేం కొదువ లేదు. అలాగే అద్భుతాలకూ అంతం లేదు. ఓ ఆలయంలోని అమ్మవారి గురించి తెలిస్తే షాక్ అవుతారు. పక్కాగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడి అమ్మవారు రోజూ రాత్రి పూట తిరుగుతారట. ప్రతి రోజు ఉదయాన్నే అమ్మవారిని చూస్తే ఆమె కకాళ్లకు మట్టి ఉంటుందట. ఇంతకీ అది ఏ ఆలయం? ఎక్కడుంది అంటారా? అది కాళి దేవి ఆలయం. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతలో ఉంది. ఈ దేవాలయం పేరు వచ్చేసి జాయ్ శ్యాంసుందరి కాళీ మందిర్ జిబంట కాళి. ఈ ఆలయంలోని అద్భుతం గురించి తెలిస్తే గూస్‌బంప్స్ వస్తాయి.
ప్రతిరోజూ రాత్రి ఆలయంలో కాళికాదేవి తిరుగుతుందట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. ఆలయ పూజారులు, స్థానికులు చెబుతారు. రాత్రి వేళల్లో ఈ అమ్మవారి పాదాల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుందట. ఇది ఏదో అపోహ అని కొట్టి పడేసినా కూడా ప్రతి రోజూ ఉదయాన్నే పూజారులు శుభ్రం చేసేందుకు ఆలయంలోకి వెళితే అక్కడ అమ్మవారి పాదాలపై ధూళి కనిపిస్తుందట. రోజూ అమ్మవారి పాదాలను శుభ్రం చేస్తూ ఉంటారట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పూజా సమయంలో కాళికాదేవి విగ్రహంలోనూ కదలికలుంటాయని పూజారులు చెబుతుంటారు. నమ్మలేని మరో నిజం ఏంటంటే.. ఇక్కడి అమ్మవారి విగ్రహం ఎదుట ఎవరైనా ఏడిస్తే అమ్మవారు సైతం కన్నీళన్లు పెట్టుకుంటున్నట్టుగా విగ్రహం భిన్నంగా కనిపిస్తుందని పూజారులతో పాటు భక్తులు చెబుతుంటారు.