ఈ కృష్ణయ్యను కోరితే ఏ కోరికైనా తీరుతుందట…

కూచిపూడి.. పేరు వినగానే నృత్యరీతి అనుకునేరు. ఇది ఏపీలోని కృష్ణాజిల్లాలోని ఓ ఊరి పేరు. ఈ కూచిపూడికి సమీపంలో మొవ్వ అనే గ్రామం ఉంది. అక్కడ మొవ్వ గోపాలుడు ఉన్నాడు. పురాతనం కాలం నాటి ఈ ఆలయ మహత్యం అంతా ఇంతా కాదు. మౌద్గల్యుడు అనే రుషి కృష్ణా తీరంలో ఘోర తపస్సు చేశాడు. ఒకరోజు ఆ మహర్షికి కృష్ణానదీ తీరంలో వేణఉగోపాలస్వామి విగ్రహం దొరికింది. దానిని స్వామివారి అనుగ్రహంగా భావించి నిత్యం పూజలు చేసేవారు. అనంతరం మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఓ ఆలయాన్ని నిర్మించారు.

వేణుగోపాల స్వామి విగ్రహ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. స్వామి చేతిలోని వేణువులో గాలి ఊదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక స్వామివారితో రుక్ష్మిణి, సత్యభామలు కూడా కనిపిస్తారు. అయితే ఈ విగ్రహం కొంత దెబ్బతినడంతో ఈ విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని తయారు చేయించి 2000 సంవత్సరంలో ఆలయంలో ప్రతిష్టించారు. ఇక ఈ స్వామివారిని కోరుకుంటే తీరని కోరిక ఉండదని నమ్మకం. పాత విగ్రహాన్ని ఆలయ వెనుక గదిలో భద్రపరిచారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ ఉపాలయం ఉంది. దానిలో హనుమంతుడు కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవనితో దర్శనమిస్తాడు.

Share this post with your friends