రామ చిలుకను పెంచుకుంటున్నారా? అది సంతోషంగా లేదో..

ఇంట్లో జంతువులను పెంచుకోవడమైతే ప్రస్తుత తరుణంలో సర్వసాధారణమై పోయింది. మనతో పాటే అవి కూడా. అయితే పెట్స్ కారణంగా మానసిక ప్రశాంతత ఉంటుందన్న కారణంగా కూడా చాలా మంది పెంచుకుంటున్నారు. చాలా మంది రామ చిలుకను ఇంట్లో పెంచుకుంటున్నారు. అది పెంచుకోవడం మంచిదేనా? వాస్తు శాస్త్రం రామ చిలుక పెంపకంపై ఏం చెబుతోందో చూద్దాం. సుఖ శాంతుల కోసమని మనం పెంచుకునే రామ చిలుక విషయంలోనూ కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సిందేనట. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో రామ చిలుకను ఉంచాలట. రామ చిలుకను పంజరంలోనే ఉంచుతాం. అయితే అది నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకోవాలట. లేదంటే ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందట.

ఇంట్లో రామ చిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా మంచిదట. ఇది జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందట. ఇంట్లోకి రామ చిలుకను తీసుకువచ్చేటప్పుడు.. దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల రాహు-కేతు, శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గడమే కాకుండా వ్యాధులు, ఇతర దోషాల నుంచి సైతం ఉపశమని లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కలతలు తగ్గడం.. పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరగడం వంటివి జరుగుతాయట. ఒకవేళ రామ చిలుక మన ఇంట్లో సంతోషంగా లేదంటే.. కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుందట. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు రామ చిలుక పదే పదే మాట్లాడితే మానసిక ప్రశాంతత చేకూరుతుందట. అది కూడా అశుభ సంకేతమని చెబుతారు.

Share this post with your friends