సూర్యోదయం సమయంలో మనిషి పంచేంద్రియాలు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ సమయంలో మనం చదువుకున్నా.. లేదంటే కొన్ని మంచి పనులు చేసినా శుభ ఫలితాలను ఇస్తుందంటారు. మన రెండు అర చేతుల్లో లక్ష్మీ దేవి.. మధ్య భాగంలో సరస్వతీ దేవి.. మూలంలో గౌరీ దేవి కొలువై ఉంటుందట. కాబట్టి ఉదయాన్నే లేవగానే ముందుగా మన రెండు అరచేతులను చూసి నమస్కరించుకోవాలట. ఇంటి నుంచి బయటకు రాగానే చూడి ఆవును కానీ.. పాలిస్తున్న ఆవును కానీ చూస్తే మనం ఏ పనిపై వెళుతున్నామో అది తప్పక నెరవేరుతుందట.
ఉదయాన్నే నిద్ర లేచే సమయంలో మన చెవులకు ఇంపుగా శంఖ నాదం కానీ.. గుడి గంటల చప్పుడో.. వేద మంత్రోచ్ఛారణ, ఆవు మెడలోని చిరు మువ్వల సవ్వడి వింటే ఆ రోజంతా చాలా బాగుంటుందట. ఇలా అయ్యిందో మనకు మధ్యలో ఆగిన పనులన్నీ పూర్తవుతాయట. అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే పాలు, పెరుగు వంటివి చూస్తే అదృష్టం కలిసొస్తుందట. సూర్యోదయం వేళ ఇంటి ఇల్లాలు ముగ్గులు పెడుతూ కనిపించినా.. తులసి పూజ చేస్తూ కనిపించినా మంచి జరుగుతుందట. మనకు ఏవైనా జీవితంలో తీరని సమస్యలుంటే ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఆవుపేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పెడితే పక్కాగా నెరవేరుతాయట.