పితృదోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే మంచి జరుగుతుందట..

మన కుటుంబ పెద్దలు ఎవరైనా కాలం చేస్తే హిందూ ధర్మం ప్రకారం వారికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు, ఆబ్దికాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. అలా చేయకుంటే దాని తాలూకు దోషాలు కుటుంబంపై చూపిస్తాయి. పితృదోషం కారణంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబంలో కలహాలు, పిల్లల ప్రవర్తనలో మార్పులు వంటి ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కోవలిసి వస్తుంది. దీనికోసం పితృదోష నివారణ తప్పనిసరిగా చేయించుకోవాలట. అయితే కొన్ని సార్లు ఎన్నో చోట్ల పితృ దేవతల కోసం తర్పణాలు వదిలినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు తప్పక దర్శించి తప్పరణాలు విడువాల్సిన ఆలయం ఒకటుంది.

అదే స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. ఇది తమిళనాడులోని తిలతర్పణపురి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే తన తండ్రి దరశరథ మహారాజుకి పితృకార్యాలు నిర్వహించాడని ప్రతీతి. కాబట్టి ఇంతటి గొప్ప ఆలయాన్ని దర్శించుకుంటే దోషాలన్నీ పోతాయట. శ్రీరాముడు సైతం ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసినా కూడా ఫలితం లభించలేదట. దీంతో తిలతర్పణపురిలోని ముక్తేశ్వరాలయంలో తర్పణం వదిలి దోషాలను పోగొట్టుకున్నాడట. కాబట్టి పితృదోషం ఉన్నవారెవరైనా ఇక్కడి ఆలయాన్ని దర్శించి తర్పణాలు వదిలితే దోష విముక్తులవుతారని ప్రతీతి.

Share this post with your friends