వామ్మో.. జామపండును నైవేద్యంగా సమర్పిస్తే ఇన్ని ఉపయోగాలా?

భగవంతుడికి పండ్లను నైవేద్యంగా సమర్పించడం ఎప్పటి నుంచో వస్తోంది. పూజా కార్యక్రమాల్లో అరటిపండు, జామపండు, యాపిల్ వంటి పండ్లన్నీ నైవేద్యంగా సమర్పిస్తూనే ఉంటాం. అయితే జామకాయను భగవంతుడికి నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? జామపండ్లను భగవంతుడిగా నైవేద్యంగా సమర్పిస్తే.. జీవితంలో రాజ గౌరవం దక్కుతుందట. ఇక పెట్టిన పండును మనం స్వీకరిస్తే.. గ్యాస్ట్రిక్, ఉదర వ్యాధులు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి జామకాయను నైవేద్యంగా సమర్పించి వాటిని ముత్తైదువులకు పంచితే మనకున్న చక్కర వ్యాధి నయమవుతుందని నమ్మకం.

అమ్మాయిలకు ఎంత ప్రయత్నించినా వివాహం కాలేదంటే ఆలయంలో జామపండును నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలట. అనంతరం ఆ పండ్లను తాంబూలంగా ముత్తైదువులకు సమర్పిస్తే మంచి వరుడు లభిస్తాడని నమ్మకం. గౌరీ పూజలో నౌవైద్యంగా సమర్పించిన జామపండును తింటే.. మానసిక ఒత్తిడి తగ్గుతుందట. దుర్గాదేవికి నైవేద్యం సమర్పించిన జామపండును తింటే సంతాన భాగ్యం కలుగుతుందట. శ్రీలక్ష్మీ నారాయణుడికి నైవేద్యంగా పెట్టిన జామపండ్లను తింటే దంపతుల మధ్య కలహాలుండవట. ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామపండ్లు వేస్తే షుగర్ సమస్యలు మాయమవుతాయట.

Share this post with your friends