ఇక్కడి చెరువులో హనుమంతుడి తోక కనిపిస్తుంది.. ఈ నీరు తాగితే..

హనుమంతుడి ఆలయాలు దాదాపు ప్రతి ఊరిలోనూ ఉంటాయి. అయితే వీటిలో ఓ ఆలయం చాలా ప్రత్యేకం.. అసలా ఆలయం ఎక్కడుంది? దాని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం? లంకలో సీతా దేవి జాడను హనుమంతుడు తెలుసుకుంటాడు. అనంతరం కోపంతో అక్కడ విధ్వంసం సృష్టించాడు. దీంతో రావణ సేన ఆంజనేయుడి తోకకు నిప్పంటిస్తుంది. ఆగ్రహించిన హనుమంతుడు లంకాదహనానికి పూనుకుంటాడు. అనంతరం హనుమంతుడి తోక కాలుతుంది. దీంతో వేడి నుంచి ఉపశమనం కోసం శ్రీరాముడిని ప్రార్థించగా.. ఆయన తన బాణంతో నీటి ప్రవాహాన్ని సృష్టించి మంటను ఆర్పేశాడు. ఈ మంటను ఆర్పిన ప్రదేశాన్ని హనుమంతుడి సిద్ధ పీఠంగా పిలుస్తారు.

హనుమంతుడి సిద్ధ పీఠం ఎక్కడుందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌‌లో ఉంది. వింధ్యాస్ ప్రారంభంలో రామ్‌ఘాట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హనుమాన్ ధార అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఓ పర్వతంపై హనుమంతుడి పెద్ద ఆలయం ఉంది. ఇక్కడి పర్వతం నుంచే ఒక చల్లని నీటి ప్రవాహంతో చెరువు నిత్యం మనకు కనిపిస్తుంది. ఆసక్తికర విషం ఏంటంటే.. హనుమంతుని విగ్రహానికి చెందిన తోక చెరువులో స్నానం చేస్తున్నట్లు ఉంటుంది. ఈ నీటికి ఒక మహత్స్యం ఉందట. ఇక్కడి నీటిలో స్నానం చేస్తే ఎన్నో వ్యాధులకు ఉపశమనం లభిస్తుందట. ఇక్కడి నీటిని అమృతమని చెబుతుంటారు. ఈ నీరు ఎప్పటికీ ఎండిపోదట.

Share this post with your friends