రేపు (మంగళవారం) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ఏం చేయాలి? ఏం చేయకూడదనే నియమాలు కొన్ని ఉంటాయి. ఏం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుంటే ఉత్తమం. హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో హనుమాన్ చాలీసాలోని 5 మంత్రాలను పఠిస్తే మనం అనుకున్నది తప్పక నెరవేరుతుందట. అయితే మరి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అనేది ముందుగా తెలుసుకోవాలి. రేపు ఉదయం 09:03 నుంచి మధ్యాహ్నం 01:58 వరకూ.. రాత్రి 08:14 నుండి 09:35 వరకూ పూజకు అనుకూలమైన సమయం.
మరి ఈ మంత్రాలను ఎలా చదవాలనేది కూడా తెలుసుకుని ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో.. పవిత్ర స్థలంలో.. తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ మంత్రాలను పఠించాలి. హనుమంతుడిని పూజించేందుకు ఉదయాన్నే నిద్ర లేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉపవాసం ఉండాలి. ఆపై ఇంట్లోని పూజగదిలో హనుమాన్ చాలీసాను పఠించాలి. ఇలా చేస్తే స్వామివారి ఆశీస్సులతో పాటు మన హృదయానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులున్నా అవన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుందట.