తమిళనాడులోని దేవాలయాలను దర్శించాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్

తమిళనాడు అంటేనే ఆధ్యాత్మిక. ఇది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడ ఎందరో దేవతలు కొలువయ్యారు. తమిళనాడులో అనేక పురాతన ఆలయాలు, మహిమానిత్వ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ అందరు దేవతల క్షేత్రాలూ ఉన్నాయి. ఇక తమిళనాడు దర్శనాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల వారికి ఈ క్షేత్రాలన్నీ చూపించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ స్పెషల్ టూర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రను ప్రకటించింది. 9 రోజుల పాటు “జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర” నిర్వహించనుంది.

ఈ యాత్ర జూన్ 22వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు తమిళనాడులోని ప్రముఖ క్షేత్రాలైన అరుణాచలం, జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చిమ, తంజావూరు తదితర ప్రదేశాలను దర్శించే వీలుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ ల మీదుగా సాగుతుంది కాబట్టి ఈ స్టేషన్లలో ప్రయాణికులకు రైలు ఎక్కే.. దిగే సౌకర్యం ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు రైలు, రోడ్డు రవాణతో సహా, వసతి సౌకర్యం, ఉదయం టీ, అల్పాహారం, లంచ్ , డిన్నర్‌లతో పాటు అన్ని కోచ్‌లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయానుంది. ఇక ఈ యాత్ర జూన్ 30న ముగియనుంది. టికెట్ ధర వచ్చేసి ఒక్కొక్కరికి రూ . 14250 థర్డ్ ఏసీ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ . 21900 సెకండ్ ఏసీ ఒక్కొక్కరికి రూ . 28450

Share this post with your friends